Zee 5 - RRR Movie: ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ పైనే పెట్టుకున్న జీ 5 బృందం

Zee 5 Team Hopes to Get Best Results With SS Rajamouli
x

Zee 5 - RRR Movie: ఆశలన్నీ ఆర్ఆర్ఆర్ పైనే పెట్టుకున్న జీ 5 బృందం

Highlights

Zee 5 - RRR Movie: పెద్ద సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జీ 5

Zee 5 - RRR Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ఆర్ఆర్" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టింది ఈ చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే పీవీఆర్ మల్టీప్లెక్స్ చైన్ తో చేతులు కలిపిన సినిమా యూనిట్ పీవీ ఆర్ఆర్ఆర్ అనే హోర్డింగ్స్ ని విడుదల చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో చిత్ర డిజిటల్ రైట్స్ ను జి 5 వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా జీ 5 వారు సొంతం చేసుకున్న పెద్ద సినిమాలలో ఇదే భారీ బడ్జెట్ సినిమా. కేవలం తెలుగు సౌతిండియాలో మాత్రమే కాక నార్త్ ఇండియాలో కూడా భారీ అంచనాలు ఉన్న సినిమా కాబట్టి ఈ సినిమా మా తో జీ 5 సబ్స్క్రైబర్లు భారీగానే పెరుగుతారు అనడంలో అతిశయోక్తి లేదు. "బాహుబలి" సినిమా తర్వాత జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఆలియా భట్ మరియు ఒలివియ మోరిస్. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయ శరణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories