సీనియర్ నటికి కరోనా.. ఆసుపత్రిలో చికిత్స!

Zarina Wahab Testing Positive : కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరిపైన తన ప్రభావాన్ని చూపిస్తోంది.

Krishna
Published on: 22 Sept 2020 12:54 PM IST
సీనియర్ నటికి కరోనా.. ఆసుపత్రిలో చికిత్స!
X

Covid-19

Zarina Wahab Testing Positive : కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరిపైన తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇందులో సినీ సెలబ్రిటీల పైన ఇంకా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా సీనియర్ నటి జ‌రీనా వ‌హాబ్‌కు(61) క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. దీనితో ఆమె వెంటనే ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో చేరారు. లీలవతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ జలీల్ పార్కర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.

జరీనా ప్రస్తుతం శ్వాసకొత స‌మ‌స్య , కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ , అలసట మరియు జ్వరాలతో సహా ప‌లు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నారు. అయితే ఆమెకి ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ త‌క్కువగా ఉండడంతో ఆమెను ప్రస్తుతం వెంటిలేట‌ర్‌పై ఉంచినట్టుగా వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఆమె చికిత్సకి స్పందిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇక హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జరీనా వహాబ్‌ నటించారు.

ఇక ఆమె 1986లో ఆదిత్య పంచోలినివివాహం చేసుకోగా, వీరికి సన అనే కూతురు, సూరజ్ పంచోలి అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం జరీనా వహాబ్‌ రానా దగ్గుబాటి, సాయిపల్లవి కాంబినేషన్‌లో వస్తున్న విరాటపర్వం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డి.సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి మూవీని నిర్మిస్తున్నారు.

Krishna

Krishna

Next Story