MAA Election: మా ఎన్నికల హాల్లో వైసీపీ లీడర్స్.. ఫోటోలు విడుదల చేసిన ప్రకాష్ రాజ్

MAA Election: మా ఎన్నికల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మా ఎన్నికల్లో ఔట్ సైడర్స్ ఉన్నారంటూ ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 22 Oct 2021 2:17 PM IST
MAA Election: మా ఎన్నికల హాల్లో వైసీపీ లీడర్స్.. ఫోటోలు విడుదల చేసిన ప్రకాష్ రాజ్
X

MAA Election: మా ఎన్నికల హాల్లో వైసీపీ లీడర్స్.. ఫోటోలు విడుదల చేసిన ప్రకాష్ రాజ్

MAA Election: మా ఎన్నికల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మా ఎన్నికల్లో ఔట్ సైడర్స్ ఉన్నారంటూ ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ఎన్నికల హల్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారని.. ఇక ఏపీలో రౌడీషీట్‌గా ఉన్న వ్యక్తులు ఓటర్లను బెదిరించారన్నారు ప్రకాశ్‌రాజ్. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల పోలింగ్‌ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాశ్‌రాజ్‌ తాజాగా కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఎన్నికల హాల్‌లోకి వైసీపీ కార్యకర్త నూకల సాంబశివరావుని ఎలా అనుమతించారంటూ? ప్రశ్నల వర్షం కురిపించారు.

క్రిమినల్ రికార్డు ఉన్న వైసీపీ నేతను వెంటబెట్టుకుని పోలింగ్‌లో మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఫోటోలు విడుదల చేశారు. నూకల సాంబశివరావు అనే వ్యక్తి ఓటర్లను బెదిరించారని చెప్పారు. విష్ణు ప్యానెల్‌ బ్యాడ్జిలు పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు 'మా' ఎన్నికల్లో చొరబడ్డారని తెలుపుతూ జగన్‌, మోహన్‌బాబు, విష్ణుతో వైసీపీ కార్యకర్త దిగిన ఫోటోలను ప్రకాశ్ రాజ్ చూపారు. మరోవైపు, ఈ వీడియోలను అతి త్వరలో బయటపెడతానని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story