కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు

Karate Kalyani-Srikanth: హైదరాబాద్ లో నిన్న రాత్రి కరాటే క‌ల్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవపై ఇరువురు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

Arun Chilukuri
Updated on: 13 May 2022 4:00 PM IST
YouTuber Srikanth Reddy Respond on Attack
X

కరాటే కల్యాణిపై యూట్యూబర్ శ్రీకాంత్‌ సంచలన ఆరోపణలు

Karate Kalyani-Srikanth: హైదరాబాద్ లో నిన్న రాత్రి కరాటే క‌ల్యాణి యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గొడవపై ఇరువురు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. తన బతుకుదెరువు కోసం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వీడియోలు చేస్తున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అయితే తనను డబ్బులు డిమాండ్ చేస్తూ కొట్టడానికే కరాటే కల్యాణి వచ్చిందన్నారు శ్రీకాంత్ రెడ్డి. త‌న‌కు అంద‌రి మ‌ద్ద‌తు కావాల‌ని కోరాడు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌న్నాడు. ఒక‌వేళ చేసి వుంటే క్ష‌మించాల‌ని కోరాడు. శ్రీ‌కాంత్‌రెడ్డి విడుద‌ల చేసిన వీడియోలో ఏమున్న‌దో ఆయ‌న మాట‌ల్లోనే తెలుసుకుందాం.

'ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం నేను వీడియోలు చేసే విష‌యం మీకు తెలుసు. కరాటే కల్యాణితో జరిగిన గొడవ మీకు తెలిసిందే. నిన్న రాత్రి డిన్న‌ర్ చేసే స‌మ‌యంలో క‌రాటే కల్యాణి మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు డీసెంట్‌గా వుంటుంది. శ్రీ‌కాంత్ బ‌య‌టికి రా అంటూ గ‌ట్టిగా అరిచారు. ఏంటి విష‌య‌మ‌ని నేను బ‌య‌టికి వ‌చ్చాను. వచ్చీ రాగానే సమాజం చెడిపోయే వీడియోలు చేస్తున్నావంటూ తిట్టింది. దీనికి నేను నువ్వు కృష్ణా సినిమాలో బాబీ అంటూ సినిమాలు చేస్తావు కదా? అవేం త‌క్కువా? అలాంటప్పుడు నేను వీడియోలు చేసుకోవడంలో తప్పు ఏంటి? అని ప్రశ్నించాను.

ఆ తర్వాత 'నా వీడియోల్లో చేసే ఆడవాళ్లు ఆర్టిస్టులు, వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తారని అని చెప్పాను. దీంతో కల్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది. ఇవ్వకపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తానని బెదిరించింది. పక్కన ఉన్న అబ్బాయి గొడవ ఎందుకు 70 వేలకి సెట్ చేస్తాను అన్నాడు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వను అనడంతో నాపై దాడి చేశారు, షర్ట్ చింపేసారు. కళ్యాణి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది. మీరంతా నాకు సపోర్ట్ ఇవ్వండి' అంటూ చెప్పుకొచ్చాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story