Harsha Sai: హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబ్ సెన్సేషన్ స్టార్ హర్ష సాయి

Harsha Sai: హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబ్ సెన్సేషన్ స్టార్ హర్ష సాయి

Jyothi
Updated on: 29 May 2023 1:30 PM IST
Youtuber Harsha Sai Entering Into Tollywood As Hero
X

Harsha Sai: హీరోగా ఎంట్రీ ఇస్తున్న యూట్యూబ్ సెన్సేషన్ స్టార్ హర్ష సాయి 

Harsha Sai: హర్ష సాయి..ఈ పేరు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కానీ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లకు ఈ మాత్రం ఈ పేరు సుపరిచితమే...యూ ట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ తో సహా ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కలిపి హర్షసాయికి 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆపదలో ఉన్నవారికి, పేదోడికి సాయం చేస్తూ సోషల్ మీడియాలో హర్ష సాయి ఒక రేంజ్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.

హర్ష సాయి వేలు, లక్షల్లో సాయం చేస్తుంటాడు. తాను సాయం చేస్తున్న వీడియోలను, ఆ సాయం పొందిన పేదోళ్ల ఆనందాన్ని వీడియోల రూపంలో రికార్డ్ చేసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. ఈ వీడియోలను నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. హర్ష సాయి యూ ట్యూబ్ ఛానల్ కు సబ్ స్క్రైబర్లు మిలియన్ల సంఖ్యలో ఉన్నారు. ఈ యూ ట్యూబ్ సెన్సేషనల్ స్టార్ కు సపరేట్ గా అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే అతడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు..

యూ ట్యూబర్ హర్ష సాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా..హర్ష సాయి మాత్రం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఔను, టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

బిగ్ బాస్ ఫేం మిత్రా శర్మ తెలుగులో ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ద్వారానే హర్షసాయి టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇక మరో విశేషం ఏంటంటే..ఈ చిత్రాన్ని హర్షసాయే తెరకెక్కించబోతున్నాడు. అంటే..తన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించనున్నాడన్నమాట..ఈ చిత్రానికి ఆదిపురుష్ ఫేం కార్తీక్ పళణి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. హర్షసాయి డెబ్యూ మూవీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని అతడి అభిమానులు చెబుతున్నారు.

Jyothi

Jyothi

Next Story