Jr NTR: యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు

Jr NTR: దేవర సినిమా రిలీజ్ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం వీడియో సందేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 4:01 PM IST
Youth should not be addicted to drugs Says NTR
X

NTR: యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దు

Jr NTR: తెలంగాణను డ్రగ్స్ రహిత సమాజంగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి మద్దతు తెలిపారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువత డ్రగ్స్ కు బానిసలు కావొద్దని ఎన్టీఆర్ సూచించారు.

దేవర సినిమా రిలీజ్ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన కోసం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో సందేశాన్ని పంపారు. మీ చుట్టూ ఉన్నవారు డ్రగ్స్ వినియోగిస్తున్నా,, అమ్మినా సంబంధిత పోలీస్ శాఖకు సమాచారం అందించాలని హితవు పలికారు ఎన్టీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story