కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన యంగ్ టైగర్

Young Tiger Made Film Ok With Kollywood Director
x

కోలీవుడ్ డైరెక్టర్ తో సినిమా ఓకే చేసిన యంగ్ టైగర్

Highlights

* ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ ఈ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నారా?

Jr NTR: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. #ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ "కే జి ఎఫ్" ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. "పోల్లాధవన్" అనే తమిళ్ సినిమాతో డైరెక్టర్ గా మారిన ప్రముఖ హీరో ధనుష్ నటించిన "వడా చెన్నై", "అసురన్" సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు వెట్రిమారన్.

తాజాగా ఇప్పుడు విడుతలై అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వెట్రిమారన్ ఎన్టీఆర్ కు ఒక అదిరిపోయే స్క్రిప్టును వినిపించారట. కథ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ కూడా సినిమాకి ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోందని మొదటి భాగంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా రెండవ భాగంలో ధనుష్ హీరోగా నటిస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. ఫుల్ లెన్త్ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అయిన వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ను చూడాలని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories