Jr NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో లో మాస్ మూవీ

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో లో ఓ మూవీ రాబోతున్నట్లు ఎన్టీర్ వెల్లడించాడు.

Venkata Chari
Published on: 13 May 2021 5:03 PM IST
Young Tiger Jr NTR Opens Up About His Next Mass Project With Prashanth Neel
X

జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో లో ఓ మూవీ రాబోతున్నట్లు ఎన్టీర్ వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్నేషనల్ మీడియా కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కెరీర్ గురించి చాలా విషయాలు వెల్లడించాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీలో విడుదలవుతుంటూ వస్తున్న పుకార్లపై స్పందిస్తూ.. అది కుదరదని, థియేటర్లోనే రిలీజ్ చేస్తారని వెల్లడించాడు. థియేటర్లో చక్కని అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నాడు.

తన రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ తర్వాత కోరటాల శివ దర్శకత్వంలో ఓసినిమా చేయనున్నట్లు తెలిపాడు. #NTR30 గా పిలువబుతోన్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ గా రానుంది. ఆ తరువాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో కలిసి #NTR31 సినిమా ఉండబోతుందని అన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్నట్లు వెల్లడించాడు. కొరటాల సినిమా అవ్వగానే #NTR31 షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నాడు.

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ పాన్-ఇండియన్ మూవీలో రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Venkata Chari

Venkata Chari

Next Story