JR NTR: సినిమా కోసం రిస్క్ చేయనున్న యంగ్ టైగర్

Young Tiger JR NTR  is Going to Risk for the Movie
x

JR NTR: సినిమా కోసం రిస్క్ చేయనున్న యంగ్ టైగర్

Highlights

JR NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

JR NTR: వరుస సూపర్ హిట్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కూడా హీరో గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా పూర్తయ్యాక కూడా ఎన్టీఆర్ డైరీ ఫుల్ గానే ఉండనుంది. మున్ముందు కూడా వరుస సినిమా షూటింగ్ లతో బిజీ కానున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

అయితే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో తన కొమరం భీమ్ పాత్ర కోసం కొంచెం లావయిన ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల సినిమా కోసం బరువు తగ్గాల్సి ఉంది. బరువు తగ్గటం హీరోలకి అంత కష్టమైన విషయం కాదు. కానీ కొరటాల సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ మళ్ళీ ఒళ్ళు చేయాల్సి వస్తుంది. ఈ నేపధ్యం ఏ లుక్ లోను ఎన్టీఆర్ కొన్నాళ్ళు కూడా ఉండలేరు. ఎన్టీఆర్ అటు రెండు పాత్రాల కోసం లుక్స్ ని ఏ విధంగా మారుస్తూ రెండిటిని హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories