logo
సినిమా

Prabhas New Look: తన కొత్త అవతారంతో అభిమానులకు షాక్ ఇస్తున్న ప్రభాస్

Young Rebel Star Prabhas New Look Video Viral in Social Media
X

ప్రభాస్ (ట్విట్టర్ ఫోటో)

Highlights

Prabhas New Look: ప్రభాస్ మళ్లీ సన్న పడ్డాడా?

Prabhas: సాహో సినిమాతో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఇప్పుడు "రాధే శ్యామ్" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ ఫాంటసీ ప్రేమ కథ కి "జిల్" ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14 న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రోమోలు మరియు పాటలకి మంచి రెస్పాన్స్ అందింది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరియు "ప్రాజెక్ట్ కే" సినిమాలు కూడా ప్రభాస్ చేతిలో ఉన్నాయి.


అయితే ఈ మధ్యనే ప్రభాస్ చాలా బరువు పెరిగాడు. మొన్న విడుదలైన ప్రభాస్ ఫోటోలు చూసి అభిమానులు చాలా బాధపడుతున్నారు. ప్రభాస్ షేప్ అవుట్ అవుతున్నాడు అని కామెంట్స్ కూడా వినిపిస్తున్న సమయంలో ప్రభాస్ సన్న పడిపోయినట్లు అతని లేటెస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్యనే ఒక పెళ్లి వేడుకకి హాజరైన ప్రభాస్ చుట్టూ అతని అభిమానులు గూమి గూడారు. ఆ వీడియోలో ప్రభాస్ చాలా సన్నగా కనిపిస్తున్నాడు. మరి ప్రభాస్ నిజంగానే సన్నగా మారాడా లేక అది ఎవరైనా ఎడిట్ చేశారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రభాస్ మళ్లీ సన్న గా మారారు అని ఆ వీడియోని అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెగ షేర్ చేస్తున్నారు.

Web TitleYoung Rebel Star Prabhas New Look Video Viral in Social Media
Next Story