'సాలార్' అంటే అర్ధం ఇదే!

సాలార్ అంటే అర్ధం ఇదే!
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సాలార్ అనే ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సాలార్ అనే ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తుంది. ఈ మేరకు బుధవారం టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఈ పాన్ ఇండియా మూవీకి అన్ని భాషల్లో సెట్టేయ్యేలా సాలార్ అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ టైటిల్ కి అర్ధం ఏంటి అని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. సాలార్ అనేది ఉర్దూ పదం కాగా, టైటిల్ కి అర్ధం దైర్యవంతమైన నాయకుడు, దారిచూపేవాడని అర్ధం. ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యాడు ప్రభాస్!

ప్రస్తుతం ప్రభాస్ జిల్ మూవీ ఫేం కె. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమా పైన మంచి అంచనాలను కలగజేసింది. వచ్చే ఏడాది సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, బాలీవుడ్ లో అదిపురుష్ అనే సినిమాలకి కమిట్ అయ్యాడు ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories