Salaar: 'సలార్' మూవీకి ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదంట

Salaar: 'కెజిఎఫ్: చాప్టర్ 1' అద్భుత విజయం సాధించడంతో కన్నడ స్టార్ యష్ సంచలనం క్రియోట్ చేశాడు.

Venkata Chari
Updated on: 6 March 2021 3:26 PM IST
Young Rebel Star Prabhas is not the First Choice for Salaar Movie
X

సలార్ మూవీలో ప్రభాస్ (ఫోటో హన్స్ ఇండియా)

Salaar: కన్నడ నటుడు యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమా 'కేజీఎఫ్ చాప్టర్ 2'. 'కెజిఎఫ్: చాప్టర్ 1' అద్భుత విజయం సాధించడంతో.. ప్రస్తుతం అందరి కళ్లు జులై లో విడుదల కానున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' పైనే ఉన్నాయి.

అయితే ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ ప్రాజెక్టులో ఉండగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో 'సలార్' సినిమా అనౌన్స్ చేశాడు. కానీ, మొదట సలార్ కోసం ప్రభాస్ ని అనుకోలేదంట డైరెక్టర్. కేజీఎఫ్ హీరో యశ్ కోసం కథ రాశాడంట. కన్నడ స్టార్ యశ్ కేజీఎఫ్ తో బిజీ గా ఉండడంతో స్టోరీ ని ప్రభాస్ కు వినిపించాడంట. ప్రభాస్ చెప్నిన మార్పులతో కథను సిధ్దం చేయడంతో.. రెబల్ స్టార్ హీరోగా సలార్ పట్టాలెక్కించాడు ప్రశాంత్ నీల్.

ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సలార్ పై అంచనాలు మాత్రం హైలెవలో ఉన్నాయి. ఈ చిత్రం 2022 లో సమ్మర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story