బాలకృష్ణ ను ఎమోషనల్ చేసిన యువ హీరోలు

Unstoppable Season 2: వీరి కష్టాలు విని బాలకృష్ణ కూడా ఎమోషనల్ అయిపోయారుగా

Jyothi
Published on: 21 Oct 2022 10:59 AM IST
Young Heroes Made Balakrishna Emotional
X

బాలకృష్ణ ను ఎమోషనల్ చేసిన యువ హీరోలు

Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో "అన్స్టాపబుల్ సీజన్ 2" ఈ మధ్యనే విడుదలై మంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా ఈ షో రెండవ ఎపిసోడ్ కు యువ హీరోలు విశ్వక్ సేన్ మరియు సిద్దు జొన్నలగడ్డలు గెస్ట్ లు గా విచ్చేశారు. ఈ యువ హీరోలతో కలిసి బాలకృష్ణ కూడా హంగామా చేశారు. ఫస్ట్ ప్రోమో లోనే బాలకృష్ణ వీరిద్దరిని తనదైన శైలిలో ఒక ఆట ఆడుకున్న సంగతి తెలుస్తోంది. స్టార్టింగ్ లోనే చమటలు పట్టించేస్తున్నారు సార్ అని విశ్వక్ సేన్ అనగా బాలయ్య గట్టిగా నవ్వేశారు.

తాజాగా "డీజే టిల్లు" సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ చెప్పిన మాటలకు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు బాలయ్య. నేను హీరోగా చేద్దాం అనుకుంటున్నా అన్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి చెప్తే "ఏంటి మచ్చలేసుకుని హీరో అయిపోదాం అనుకుంటున్నావా నువ్వు," అని అవమానించాడని చెప్పుకొచ్చాడు సిద్దు. ఆ మాటలు విన్న బాలయ్య కూడా "నాకు వస్తున్నాయి కన్నీళ్లు ఇప్పుడు. నువ్వు అక్కడితో ఆపేసి ఇటు రామ్మా" అంటూ సిద్దు ని హగ్ చేసుకుని అందర్నీ భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు బాలయ్య. మరోవైపు విశ్వక్ సేన్ కూడా తన సినిమా సమయంలో తన సిస్టర్ ఆరోగ్యం పాడైందని రాత్రి హాస్పిటల్ లో ఉదయం షూటింగ్ సెట్లో ఉండాల్సి వచ్చిందని డైరెక్టర్ కట్ చెప్పిన వెంటనే ఏడుపు వచ్చేసేదని, అటు అక్కని వదిలి ఉండలేక ఇటు సినిమా వదలలేక సతమతమయ్యానని చెప్పగా బాలయ్య కూడా ఆ మాటలకు ఎమోషనల్ అయ్యారు.

Jyothi

Jyothi

Next Story