Rao Ramesh: మరో ఛాలెంజింగ్ పాత్రలో రావు రమేష్

Rao Ramesh: రావు రమేష్ నిస్సందేహంగా సినీ పరిశ్రమలో అత్యంత బహుముఖ నటులలో ఒకరు.

Venkata Chari
Published on: 2 May 2021 7:07 PM IST
Yet another Challenging role for Rao Ramesh
X

రావు రమేష్ (ఫొటో దిహన్స్ ఇండియా)

Rao Ramesh: రావు రమేష్ నిస్సందేహంగా సినీ పరిశ్రమలో అత్యంత బహుముఖ నటులలో ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి తన సత్తాను చాటాడు.

హాస్యం, విలన్, సహాయక పాత్ర ఇలా ఏదైనా సరే.. రావు రమేష్ తన ఉత్తమ నటనను ఇవ్వడంలో నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. తాజా నివేదికల ప్రకారం, రావు రమేష్ తన కెరీర్లో మరో విభిన్నమైన పాత్రను పోషించబోతున్నాడు.

'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' సినిమాతో రాబోతున్నడని మనకు తెలుసు. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్‌తో చేతులు కలిపాడు. ఈ సినిమాలో రావు రమేష్ వైకల్యం .. పార్శ్వగూనితో బాధపడుతున్న వ్యక్తి పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ పాత్రలో ఆయన నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో రావు రమేష్ ను చేసేందుకు ఆయన అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.

Venkata Chari

Venkata Chari

Next Story