KGF 2 : దుమ్మురేపుతోన్న కేజీఎఫ్-2 టీజర్

Yashs KGF-2 Teaser Creates New Record
x

Yash's KGF-2 Teaser:(The Hans India)

Highlights

KGF 2 : ‘కేజీయఫ్ – 2’ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1 మిలియన్ పైగా కామెంట్స్ రాబట్టింది

KGF 2 : కేజీఎప్-2.. రాకీభాయ్.. కోసం అందరూ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కేజీఎప్-1 తో క్రియేట్ అయిన సెన్సేషన్ ఇంకా అలాగే ఉంది. ఆ ఇంప్రెషన్ తో.. సెకండ్ పార్ట్ కూడా దుమ్ము దులిపేస్తుందనే అంచనాలో సినీ పరిశ్రమ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హైలీ డిమాండ్ డైరెక్టర్ అయిపోయాడిప్పుడు. జనవరిలో రిలీజ్ అయిన సీక్వెల్ టీజర్ అలిసిపోకుండా రికార్డులు బద్ధలుకొడుతూనే ఉంది.

యూట్యూబ్ లో అతి తక్కువ రోజుల్లో అత్యధిక కామెంట్లు పొందిన తొలి శాండిల్ వుడ్ టీజర్ గా 'కేజీయఫ్ – 2' టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1 మిలియన్ పైగా కామెంట్స్ రాబట్టింది ఈ టీజర్.. ఈ రికార్డ్ నమోదు చేసిన నాల్గవ ఇండియన్ కేజీఎఫ్ 2 నిలిచింది. ఇప్పటి వరకు ఈ టీజర్ 188 మిలియన్స్ కి పైగా వ్యూస్.. 8 మిలియన్లకి పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

2018లో బాక్సాఫీస్‌ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 భారీ విజ‌యం సాధించ‌డంతో ఛాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

కేజీఎఫ్ చాప్టర్ -1 పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్-2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ విషయంలో చిత్రబృందం ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారని తెలుస్తుంది. యష్ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 7న రిలీజ్ చేసిన 'కేజీఎఫ్ ఛాప్టర్-2' టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories