Yashoda: యశోద సినిమా వివాదానికి లైన్‌ క్లియర్‌.. ఇక సినిమాలో..

Yashoda Movie Issue Solved Says Producer Shivalenka Krishna Prasad
x

Yashoda: యశోద సినిమా వివాదానికి లైన్‌ క్లియర్‌.. ఇక సినిమాలో..

Highlights

Yashoda Movie: ఈమధ్యనే స్టార్ బ్యూటీ స‌మంత హీరోయిన్ గా న‌టించిన "య‌శోద‌" సినిమా విడుదల అయిన సంగ‌తి తెలిసిందే.

Yashoda Movie: ఈమధ్యనే స్టార్ బ్యూటీ స‌మంత హీరోయిన్ గా న‌టించిన "య‌శోద‌" సినిమా విడుదల అయిన సంగ‌తి తెలిసిందే. మొదటి రోజు నుండి ఈ సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఒక వివాదం లో ఇరుక్కుంది. స‌రోగ‌సీ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో "ఈవా" అనే పేరుతో ఒక స‌రోగ‌సీ ఫెసిలిటీ సెంట‌ర్ గురించి చూపించారు. అక్కడ జ‌రిగే అక్రమాల గురించి "య‌శోద‌" క‌థ‌.

అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిజంగానే "ఈవా" అనే ఒక స‌రోగ‌సీ ఫెసిలిటీ సెంట‌ర్ ఉంది. దాంతో "ఈవా ఐవీఎఫ్‌" ఆసుప‌త్రి వ‌ర్గాలు కోర్టుని ఆశ్రయించాయి. య‌శోద సినిమాలో తమ పరువు, ప్రతిష్ట న‌ష్టం క‌లిగించే స‌న్నివేశాలు ఉన్నాయ‌ని వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని దీనికి తగ్గట్టు నిర్మాత‌ రూ.5 కోట్ల న‌ష్టప‌రిహారం కూడా చెల్లించాల‌ని వారి ఆరోపణ. ఇప్పుడు ఈ వివాదాన్ని సామ‌రస్యంగా ప‌రిష్కరించుకున్నారు నిర్మాత‌.

"య‌శోద‌" సినిమాలోని "ఈవా" అనే పేరుని తొల‌గించామ‌ని ఓటీటీ శాటిలైట్ లో ఈ సినిమాని ప్రద‌ర్శించిన‌ప్పుడు కూడా "ఈవా" అనే పేరు ఉండదని నిర్మాత హామీ ఇచ్చారు. ఇక "ఈవా" పేరు తొల‌గించి కొత్త ప్రింటుని కూడా "ఈవా" యాజ‌మాన్యానికి చూపించారు. వారు కూడా సంతృప్తిని వ్యక్తం చేసి కోర్టులో పిటీష‌న్‌ని వెన‌క్కి తీసుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇంకా "య‌శోద‌" సినిమా ప్రద‌ర్శన‌లో ఉంది. కాబట్టి "ఈవా" పేరు తొల‌గించ‌డం అంత సులువు కాదు. దానికిమళ్ళీ రీ సెన్సార్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఖ‌ర్చుతో కూడుకున్న వ్యవ‌హారం కాబ‌ట్టి థియేట‌ర్ల వ‌ర‌కూ "ఈవా" అనే పేరు ఉంచేసి డిజిటల్ వెర్షన్ లో తొలగించడం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories