రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన యశ్

* రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన యశ్

admin1
Updated on: 12 April 2022 2:30 PM IST
Yash Clarifies about Film with Rajamouli | Telugu Movie News
X

రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన యశ్

Yash: అప్పటి దాక కన్నడ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైన కన్నడ హీరో యశ్ క్రేజ్ "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ యశ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమాతో బిజీగా ఉన్న యశ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు జవాబిచ్చారు.

రాజమౌళితో సినిమా యశ్ సినిమా చేసే అవకాశం ఉందా అని అడగగా యశ్ తనకి కూడా రాజమౌళి తో కలిసి పనిచేయాలని ఉంది అని క్లారిటీ ఇచ్చారు. "ఆ విషయం డైరెక్టర్ మాత్రమే చెప్పాలి. రాజమౌళి గారికి ఒక విజన్ ఉంది. ఆయనకు ఉన్న స్పెసిఫికేషన్స్ కి నేను సెట్ అవుతాను అనుకుంటే నన్ను సంప్రదిస్తారు.

కథ నచ్చితే నేను కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను" అని అన్నారు యశ్. మరి రాజమౌళితో యశ్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక మరోవైపు ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నారు.

admin1

admin1

Next Story