WWW Movie: యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోన్న శివాని రాజాశేఖర్ WWW మూవీ సాంగ్‌

WWW Movie: ఆదిల్‌ అరున్‌, శివాని రాజాశేఖర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'

Samba Siva Rao
Published on: 3 Jun 2021 5:22 PM IST
WWW Movie Kannulu Chedire Lyrical song gets 1 Million Views on Youtube
X

WWW movie poster 

WWW Movie: ఆదిల్‌ అరున్‌, శివాని రాజాశేఖర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ'. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. 'కన్నులు చెదిరే అందాన్నె వెన్నెల తెరపై చూశానే కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే అంటూ సాగే ఈ లవ్‌ మెలోడి సాంగ్‌ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను నటుడు అడవి శేష్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట యూట్యూబ్‌లో ట్రేండ్‌ అవుతోంది.

ఈ చిత్రానికి సమన్‌ కె. కింగ్‌ సంగీతం అందించిన ఈ పాట‌ యూట్యూజ్‌లో 1 మిలియ‌న్‌కి పైగా వ్యూస్‌ని సాధించింది. అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ , యాజిన్‌ నిజార్‌ గాత్రం చక్కగా కుదిరాయి. ఇప్పటికే ఈ వీడియో సాంగ్‌ విడదల కార్యక్రమంలో అడవి శేష్‌ మాట్లాడుతూ పాట అద్భుతంగా ఉందంటూ 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా తమ పాట ఇంతటి ఆదరణను దక్కించుకున్నందుకు

నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ.. 'మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. అలాగే ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, నైలున‌ది, లాక్‌డౌన్ ర్యాప్‌ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అడివిశేస్‌కు, ఆదిత్య మ్యూజిక్ వారికి మా రామంత్ర క్రియేష‌న్స్ త‌ర‌పున ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాం' అంటు ఆనందం వ్యక్తం చేశారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, వైవా హర్ష తదితరులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తోన్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story