'క్రాక్' సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రచయిత..

Ravi Teja: వరుస డిజాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

Arun Chilukuri
Updated on: 13 May 2022 9:15 PM IST
Writer Complaints Against Ravi Teja Krack Movie
X

‘క్రాక్’ సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రచయిత..

Ravi Teja: వరుస డిజాస్టర్ లతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకి ఈ సినిమాతో మంచి బూస్ట్ లభించింది. అయితే తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమా కథ తనదేనంటున్న ఒక రచయిత ఈ చిత్ర నిర్మాత తనను మోసం చేసి తన కథని వాడుకున్నారు అంటూ చిత్ర బృందం పై కేసు నమోదు చేశారు.

అల్వాల్ లో నివాసముంటున్న శివ సుబ్రహ్మణ్య మూర్తి అనే ఒక వ్యక్తి 2015 లో బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. "క్రాక్" సినిమాలోని సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నదేనని ఆ రచయిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సదరు నిర్మాణ సంస్థతో, దర్శకుడితో మరియు ఫిలిం ఛాంబర్ కి కూడా చాలానే నోటీసు ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోలేదని సుబ్రహ్మణ్య మూర్తి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఈ విషయంలో చిత్రబృందం మౌనం వహిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story