Bigg Boss Telugu 8: అప్పుడే మొదలైన గొడవలు.. హౌజ్‌లో రచ్చ స్టార్ట్‌ అయ్యిందిగా..

Biggboss Telugu 8 Latest Episode Review: గొడవలు, ప్రేమలు, కోపాలు, సంతోషం, ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌ బిగ్‌బాజ్‌ హౌజ్‌లో కనిపిస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 3 Sept 2024 12:57 PM IST
Words Exchange Between Shekar Basha and Sonia, Biggboss Telugu 8 Latest Episode Review
X

Bigg Boss Telugu 8: అప్పుడే మొదలైన గొడవలు.. హౌజ్‌లో రచ్చ స్టార్ట్‌ అయ్యిందిగా..

Biggboss Telugu 8 Latest Episode Review: గొడవలు, ప్రేమలు, కోపాలు, సంతోషం, ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌ బిగ్‌బాజ్‌ హౌజ్‌లో కనిపిస్తాయి. ఏ గొడవ లేకపోతే స్వయంగా బిగ్‌బాస్‌ ఏదో ఒక గొడవను సృష్టిస్తాడు. 14 మంది ఒకేచోట చేరడంతో ఎక్కడలేని గొడవలు జరుగుతుంటాయి. ప్రతీ సీజన్‌లో హౌజ్‌ మేట్స్‌ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణమని చెప్పాలి.

కాగా బిగ్‌బాస్‌ సీజన్‌ 8లో కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. సీజన్‌ ప్రారంభమై మూడు రోజులు కూడా పూర్తికాకముందే గిల్లికజ్జాలు మొదలయ్యాయి. తాజాగా సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌ మధ్య గొడవలు షురు అయ్యాయి. శేఖర్‌ బాషా, సోనియా మధ్య వాగ్వాదానికి తెర లేసింది. శేఖర్‌ బాషకు సోనియా కౌంటర్‌ ఇవ్వడంతో కొంతమేర గొడవ జరిగింది.

ఇక నాగమణికంఠ, ఆదిత్య ఓం మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నాగమణికంఠ వద్దకు వచ్చిన ఆదిత్య ఓం సారీ చెప్పాడు. హౌస్‌లో నుంచి ఎవరిని బయటకు పంపాలి అంటే నేను నీ పేరు కావాలని చెప్పలేదంటూ క్లారిటీ ఇచ్చాడు ఓం. అయితే మణికంఠ పర్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నిఖిల్ మణికంఠతో మాట్లాడాడు. ఆదిత్య ఓం పెద్దోడు సారీ చెప్తే అలా గౌరవం లేకుండా మాట్లాడకూడదంటూ వ్యాఖ్యానించాడు. ఎలా ఆడాలో తనకు తెలుసు అని, ఎవరి సలహాలు అక్కర్లేదంటూ కాస్త దురసుగా మాట్లాడాడు.

ఇక హౌజ్‌మేట్స్‌ కొందరు ఆరెంజ్‌లతో క్యాచ్‌లు ఆడడం కూడా చర్చకు దారి తీసింది. ఆరెంజెస్‌తో ఆడుతున్న వారు తర్వాత దాన్ని ముట్టుకోవడానికి లేదంటూ సోనియా చెప్పడంతో వాగ్వాదానికి దారి తీసింది. ఆహారంతో ఆటలు ఏంటంటూ సోనియా ఫైర్‌ అయ్యింది. మిగిలిన వారు సైలెంట్ అయినా, శేఖర్‌ బాషా మాత్రం తగ్గలేదు. మాటకుమాట సమాధానం ఇచ్చారు. ఫుడ్‌తో ఆటలు ఆడొద్దని బిగ్‌బాస్‌ రూల్స్‌లో ఉందా అంటూ హంగామా చేశాడు. అయితే దీనిపై సోనియా కూడా తీవ్రంగా స్పందించింది. 'నీకు ఇచ్చిన ఫుడ్‌ను ఏమైనా చేసుకో కానీ, అది వేరేవాళ్లకు తినడానికి ఇవ్వకు. ఎవరైతే దాన్ని మనుషుల్లాగ తిందామనుకుంటున్నారో వాళ్లకి మాత్రం ఇవి పెట్టండి' అంటూ ఫైర్‌ అయ్యింది సోనియా. దీంతో మొత్తం మీద బిగ్‌బాస్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ వాదనలు ప్రతివాదనలతో రచ్చకు దారి తీసింది. మరి రానున్న రోజుల్లో ఈ గొడవలు ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story