ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాటతో జియోకు రూ.500 కోట్ల నష్టం... ఇంతకీ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాట ఏంటి..?

With That One Word NTR, Jio Lost Rs.500 Crores
x

ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాటతో జియోకు రూ.500 కోట్ల నష్టం... ఇంతకీ ఎన్టీఆర్ అన్న ఆ ఒక్క మాట ఏంటి..?

Highlights

Jr NTR: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ వరల్డ్ కు చేరింది.

Jr NTR: ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ వరల్డ్ కు చేరింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ రావడంతో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరితో సినిమాలు తీసేందుకు బాలీవుడ్ తెగ ఉత్సాహం చూపిస్తుంది. వీరి క్రేజ్ ఎంతగా పెరిగిందంటే...ఎస్ అంటే సినిమా తీద్దాం..నో అంటే ఆపేసుకుంద్దాం అనే రేంజ్ లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పడంతో బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రద్దయింది కూడా.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ యూరి ది సర్జికల్ స్ట్రయిక్ ను తెరకెక్కించిన ఆదిత్య ధార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఇమ్మోర్టల్స్ అశ్వత్థామా చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ లో మెయిన్ లీడ్ గా విక్కీ కౌషల్ ను ఎంచుకొని రోని స్క్రూవాలా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాడు. అయితే కొన్ని అనుకోని కారణాలతో రోనీ తప్పుకోవడంలో ఆ ప్రాజెక్ట్ ను జియో స్టూడియోస్ టేక్ అప్ చేసింది.

ఇమ్మోర్టల్స్ అశ్వత్థామాను జియో స్టూడియోస్ చేతిలోకి రాగానే ఆ సంస్థ భారీ మార్పులకు దిగింది. పాన్ ఇండియా కథాంశం కావడంతో భారీ తారాగణం ఉండాలని భావిస్తూ విక్కీ కౌషల్ ను ప్రాజెక్ట్ నుంచి తప్పించి ఆ స్థానంలో రణవీర్ సింగ్ ని తీసుకున్నారు. మరో పాత్ర కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారు. ఈ ప్రాజెక్ట్ కు తొలుత ఓకే చెప్పిన ఎన్టీఆర్ పాత్రల విషయంలో విభేదాలు రావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇమ్మోర్టల్స్ అశ్వత్థామా పై ఎన్టీఆర్ ఆసక్తి కనబర్చకపోవడంతో జియో స్టూడియోస్ ఏకంగా ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టేసింది.

ఎన్టీఆర్ నో చెప్పడంతో జియో సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం జియో సంస్థ ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. ఎన్టీఆర్ నో చెప్పడంతో ప్రాజెక్ట్ పై 500 కోట్ల రూపాయలను ఖర్చు చేసే కంటే నిలిపివేయడమే ఉత్తమని జియో సంస్థ డిసైడ్ అయింది. అందుకే ప్రాజెక్ట్ ను రద్దు చేసుకున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories