Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్

* Happy Birthday Pawan Kalyan: హ్యాపీ బర్త్డే పవర్ స్టార్

Sandeep Reddy
Updated on: 2 Sept 2021 1:56 PM IST
Wishing You Very Happy Birth Day To Power Star Pawan Kalyan
X

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ (ట్విట్టర్ ఫోటో)

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ...

పవన్ అంటే ప్రభంజనం.. పవన్ వెంటే మహాజనం.. పవన్ అంటే అభిమానులకు ప్రాణం.. కచ్చితంగా ఇది పవన్ కి నీరాజనం..

పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్..

సుప్రీమ్ స్టార్ చిరంజీవి రాజ్యమేలుతున్నాడు.. యువరత్న బాలకృష్ణ శాసిస్తున్నాడు.. యువసామ్రాట్ నాగార్జున సామ్రాజ్యమేలుతున్నాడు.. విక్టరీ వెంకటేష్ జయం మనదేరా అంటున్నాడు..

అప్పుడోచ్చాడు సరిగ్గా ఎవరు ఉహించని ఒక స్టార్.. అపుడు ఇతను స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు..కనీసం తాను కూడా అనుకోలేదు.. కానీ తొలిప్రేమ తొలి హిట్ అయింది..తరువాత అన్నయ్యకి తమ్ముడు అయ్యాడు.. బద్రితో ప్రేమికుడు అయ్యాడు.. ఖుషితో ట్రెండ్ అయ్యాడు.. కాలం కలిసి రాక సైలెంట్ అయ్యాడు మాటల మంత్రికుడితో కలిసిన తరువాత మాయావి అయ్యాడు.. కొంతకాలం ఎదురుచూసాడు తరువాత అత్తారింటికి దారి వెతికాడు... అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.. వనితల వంచెన కథలను త్రుంచే వకీల్ అయ్యాడు.. రేయ్ అంటే తోక్కేస్తా అంటున్నాడు..

కొంతమంది పుట్టుకతో స్టార్లు అవుతారు.. కొంతమంది అరువుకు తెచ్చుకొని స్టార్లు అవుతారు.. ఇంకొంతమంది అనుకోకుండా స్టార్లు అవుతారు.. ఇంకొంతమంది జనం చేస్తే స్టార్లు అవుతారు అలా అయిన స్టారే పవర్ స్టార్..కోట్లాది మంది అభిమానులు అభిమానించే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్..

అల్ ది బెస్ట్ భీమ్లా నాయక్..

Sandeep Reddy

Sandeep Reddy

Next Story