త్రివిక్రమ్ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా?

Will Trivikram Sentiment Repeat Again
x

త్రివిక్రమ్ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా?

Highlights

* త్రివిక్రమ్ కారణంగా మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సినిమాలు ప్లాప్ అవుతాయా?

Trivikram Srinivas: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం ఒక సినిమా పైన ఫోకస్ చేసి విడుదల చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ రెండు పడవల ప్రయాణం మాత్రం త్రివిక్రమ్ కి అంతగా వర్కౌట్ అవ్వదు.

గతంలో మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ అదే చేశారు. మహేష్ బాబుతో "ఖలేజా" మరియు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్మార్" సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. 2010లో "ఖలేజా" సినిమా విడుదల కాగా 2011లో "తీన్మార్" సినిమా విడుదలైంది. కానీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత మళ్లీ 2012లో అల్లు అర్జున్ హీరోగా "జులాయి" సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు త్రివిక్రమ్.

అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" తెలుగు రీమేక్ కి స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మహేష్ బాబు హీరోగా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్నారు. మళ్ళీ ఇద్దరు హీరోలతో రెండు పడవల ప్రయాణం త్రివిక్రమ్ కు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో అని అభిమానులు కంగారుపడుతున్నారు. యాదృచ్ఛికంగా త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా చేస్తున్నది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోనే. మరి పదేళ్ల క్రితం జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories