logo
సినిమా

పవన్ కోసం మళ్ళీ రైటర్ గా త్రివిక్రమ్.. అతన్ని డామినేట్ చేస్తాడా..?

Will Trivikram Srinivas Dominate Samuthirakani
X

పవన్ కోసం మళ్ళీ రైటర్ గా త్రివిక్రమ్.. అతన్ని డామినేట్ చేస్తాడా..?

Highlights

Trivikram Srinivas: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందే ఉంటుంది.

Trivikram Srinivas: ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందే ఉంటుంది. మాటల మాంత్రికుడిగా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న త్రివిక్రమ్ దర్శకుడిగా మాత్రమే కాక మరోవైపు రైటర్ గా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ తన కెరియర్ ను ఒక రైటర్ గా నే మొదలు పెట్టారు. కానీ డైరెక్టర్ గా మారిన తర్వాత కేవలం రైటర్ గా మాత్రమే త్రివిక్రమ్ పని చేసిన సినిమాలు చాలా తక్కువ.

తన కథలను తానే డైరెక్ట్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ లను అందిస్తున్నారు త్రివిక్రమ్. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా కోసం మళ్లీ రైటర్ గా మారారు. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. కానీ చాలావరకు సినిమా క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ కే దక్కింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమాని రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ అయిన సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా కనిపించనున్నారు.

అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ రైటర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా త్రివిక్రమ్ ఈ కథలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ సముద్రఖని ఈ మార్పులను ఒప్పుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు సినిమా ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించింది సముతిరఖని. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది. మరి తెలుగులో త్రివిక్రమ్ డామినేషన్ సముద్రఖనికి ఇబ్బందిగా మారనుందా అని అనుమానాలు మొదలయ్యాయి.

Web TitleWill Trivikram Srinivas Dominate Samuthirakani
Next Story