Virupaksha: విడుదలకి ముందే సీక్వెల్ అంటున్న మెగా హీరో

Will there be a Sequel to the Movie Virupaksha?
x

Virupaksha: "విరూపాక్ష" సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా?

Highlights

Virupaksha: విడుదలకి ముందే సీక్వెల్ అంటున్న మెగా హీరో

Virupaksha: బైక్ యాక్సిడెంట్ తర్వాత సినిమాలకి దూరంగా ఉన్న మెగా హీరో సాయి ధరంతేజ్ వెండి తెర మీద కనిపించి చాలా కాలం అయింది. తాజాగా ఇప్పుడు సాయి తేజ్ విరూపాక్ష అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నాడు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా ఇంకా విడుదల కూడా అవ్వలేదు కానీ అప్పుడే చిత్ర బృందం సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టేసింది.

ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతోంది అని హింట్ ఇస్తుంది చిత్ర బృందం. సినిమా క్లైమాక్స్ లో కూడా సీక్వెల్ కి సంబంధించి హింట్ ఉంటుందని సమాచారం. ప్రత్యేకంగా ఈ సీన్ కోసమే సాయి తేజ్ మళ్లీ ఎక్స్ట్రాగా షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూశాక స్క్రిప్ట్ అందించిన సుకుమార్ బాగా ఇంప్రెస్ అయ్యి సినిమా సీక్వెల్ కి సంబంధించి ఐడియా ఇచ్చారట. సినిమా క్లైమాక్స్ లో దీనికి సంబంధించి ఇంకో సీన్ కూడా ఉంటే బాగుంటుందని సూచించారట. దీంతో చిత్ర బృందం ఈ ఒక్క సీన్ ని మళ్లీ షూట్ చేసిందట.

మంచి అంచనాల మధ్య ఈ సినిమా వచ్చేవారం ఏప్రిల్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సాయి తేజ్ కూడా సినిమా కోసం భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు. "పుష్ప 2" సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ "విరూపాక్ష 2" స్క్రిప్ట్ రాసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విరూపాక్ష సినిమాతో సాయి తేజ్ ఎంతవరకు హిట్ అందుకుంటారు దయచేసి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories