తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకుంటాయా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకుంటాయా?
x
Highlights

సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక ధియేటర్లో సినిమాలు చూడోచ్చనుకుంటున్న ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందా?...

సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక ధియేటర్లో సినిమాలు చూడోచ్చనుకుంటున్న ప్రేక్షకుల కోరిక నెరవేరుతుందా? థియేటర్లు అక్టోబర్ 15 నుంచి స్టార్ట్ అవుతాయా? కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా? ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ప్రశ్న తలెత్తుతోంది.

అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరుచుకోబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు తగ్గ మార్గనిర్ధేశకాలిచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ఇలా కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే అసలు సమస్య ఇక్కడే ఉంది. ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. ఇప్పటికే రాంగోపాల్ వర్మ కరోన వైరస్ సినిమాను అక్టోబర్ 15 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తానని ప్రకటించాడు కూడా కానీ అది జరుగుతుందా ?

కేంద్ర ప్రభుత్వం బార్లు తెరుచుకోవడానికి దాదాపు 2 నెలల క్రితమే పర్మిషన్ ఇచ్చింది కానీ మన రాష్ట్రప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినంత మాత్రానా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం మరో నెల రోజుల వరకు ధియేటర్లకు పర్మిషన్ లేదని చెప్పేసింది. కారణం రోజురోజుకు కరోనా వైరస్ విజృంబిస్తుండటమే. ఇక థియేటర్లకు పర్మిషన్ ఇస్తే పబ్లిక్ కి ఇబ్బందులు, వైరస్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఇంత రిస్క్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోలేవు. సినిమా అనేది మన ప్రభుత్వాలకు లాస్ట్ ప్రయారిటీ మాత్రమే. థియేటర్లకు ప్రత్యామ్నయంగా ఓటిటిలు ఉండనే ఉన్నాయి. ప్రేక్షకులు వాటికి అలవాటు పడటంతో ధియేటర్లకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలకు పెద్దగా లాభాం లేదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు ఉన్నాయంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories