Dasara: నాని పైనే తన ఆశలన్నీ పెట్టుకున్న నిర్మాత..

Will the Flop Producer Get a Hit With Natural Star?
x

నాచురల్ స్టార్ సినిమాతో ఫ్లాప్ నిర్మాత హిట్ అందుకుంటారా?

Highlights

Nani: నాని పైనే తన ఆశలన్నీ పెట్టుకున్న నిర్మాత

Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "దసరా". ఈ సినిమాలో ఇంతకు ముందు ఎన్నడూ కనిపించినటువంటి రస్టిక్ పాత్రలో నాని ఈ సినిమా లో కనిపించనున్నారు. ఇక ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్ర ట్రైలర్ వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పుకోవచ్చు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు ముందే జోష్యం చెబుతున్నారు.

ఇక ఈ సినిమాతో ఇప్పటిదాకా ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేని నిర్మాత సుధాకర్ చెరుకూరి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఈ సినిమాతో కచ్చితంగా సేఫ్ జోన్ లోకి వచ్చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా సుధాకర్ చెరుకూరి తెలుగులో ఐదు సినిమాలను నిర్మించారు. కానీ ఆ ఐదు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గానే నిలిచాయి.

సందీప్ కిషన్ "రన్" సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టిన సుధాకర్ చెరుకూరి "పడి పడి లేచే మనసు", "ఆడవాళ్లు మీకు జోహార్లు", "విరాటపర్వం", "రామారావు ఆన్ డ్యూటీ" సినిమాలతో కూడా ఫ్లాపులు మాత్రమే అందుకున్నారు. కానీ నాని దసరా సినిమాతో సుధాకర్ చెరుకూరి తన కెరియర్ లోనే మొట్టమొదటి సూపర్ హిట్ అందుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ కి వచ్చిన క్రేజ్ తో సినిమా డిజిటల్ మరియు సాటిలైట్ రైట్స్ విలువ భారీగానే పెరిగింది. మరి నాని ఈ నిర్మాతకి ఎంతవరకు మొదటి బ్లాక్ బస్టర్ ని అందిస్తారో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories