బాలకృష్ణ సీక్వెల్ సినిమా ను శివలెంక నిర్మిస్తారా?

*సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే తన బ్లాక్ బస్టర్ సినిమా "ఆదిత్య 369" కీ సీక్వెల్ అయిన "ఆదిత్య 999" గురించి అధికారికంగా ప్రకటించారు.

Jyothi
Published on: 23 Nov 2022 10:45 AM IST
Will Sivalenka Produce Balakrishna Sequel Movie?
X

బాలకృష్ణ సీక్వెల్ సినిమా ను శివలెంక నిర్మిస్తారా?

Nandamuri Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే తన బ్లాక్ బస్టర్ సినిమా "ఆదిత్య 369" కీ సీక్వెల్ అయిన "ఆదిత్య 999" గురించి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ స్వయంగా మెగా ఫోన్ ని పట్టుకోబోతున్నట్లుగా సమాచారం. బాలయ్య ఈ సినిమా కోసం కథను చాలా ఇష్టంగా రాసుకున్నారు. అందుకే స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. "ఆదిత్య 999" తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలాగా ఉండాలని బాలకృష్ణ ప్లాన్. అందుకు తగ్గట్టుగానే ప్రీ ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తోంది చిన్న బృందం. ఇక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రాబోతున్న సినిమా కాబట్టి నేటి జనరేషన్ కు నచ్చేలాగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమాని ఎవరు నిర్మించనున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. "ఆదిత్య 369" సినిమాని శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆ సినిమాతో ఎంతో ప్రాఫిట్లు గడిచిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాకి సీక్వెల్ "ఆదిత్య 999" ను కూడా నిర్మించనున్నారా అని ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. అప్పట్లోనే కోటిన్నరకు పైగా బడ్జెట్ తో విడుదలైన "ఆదిత్య 369" 9 కోట్లను వసూలు చేసింది. ఆ సినిమా సీక్వెల్ రైట్స్ ను బాలకృష్ణ సొంతం చేసుకున్నారు. మరి "ఆదిత్య 999" నిర్మాతగా శివలెంక కు అవకాశం కల్పిస్తారా లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story