Thalapathy 68: దళపతి విజయ్ 68లో సీనియర్ హీరోయిన్.. పవర్ ఫుల్ పాత్రలో ఆమె..

Thalapathy 68: దళపతి విజయ్ ఈ ఏడాది వారసుడు ఇంకా లియో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Shekhar G
Published on: 26 Dec 2023 6:49 PM IST
Will Senior Heroine Ramya Krishna Play A Key Role In Thalapathy Vijay 68th Movie?
X

Thalapathy 68: దళపతి విజయ్ 68లో సీనియర్ హీరోయిన్.. పవర్ ఫుల్ పాత్రలో ఆమె..

Thalapathy 68: దళపతి విజయ్ ఈ ఏడాది వారసుడు ఇంకా లియో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాల్లో లియో పర్వాలేదు అని అనిపించింది కానీ ఆడియన్స్ అంచనాలని అందుకోవడం లో మాత్రం విఫలం అయింది అని చెపుకోవచ్చు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు దళపతి 68 పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దళపతి విజయ్ కోసం అదిరిపోయే స్టోరీ ని సిద్ధం చేశారట వెంకట్ ప్రభు. అంతే కాదు ఈ సినిమాలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్ లో చేస్తున్నట్లు తెలుస్తోంది.

దళపతి విజయ్ ఈ సినిమాలో తండ్రి కొడుకు పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్‌, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా, స్నేహ, యోగిబాబు, కిచ్చా సుదీప్‌ ఇలా చాలా మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. వీళ్ళతో పాటు మరో సీరియర్ హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించనుందని తెలుస్తోంది.

ఆమె మరెవరో కాదు.. దళపతి విజయ్ 68 సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ చాలా పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. బాహుబలి సినిమా తరవాత రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకొని వెళ్తున్నారు. ఇక ఇప్పుడు దళపతి 68లోను నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చైన్నెలో ప్రారంభమై థాయిలాండ్‌, టర్కీ, హైదరాబాద్‌‌లో జరిగిందని సమాచారం.



Shekhar G

Shekhar G

Next Story