Tollywood: సమంతతో మళ్ళీ కలిసి నటించడంపై రియాక్ట్ అయిన నాగచైతన్య

Tollywood: నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన మొదటి సినిమా "ఏ మాయ చేసావే".

Arun Chilukuri
Updated on: 1 Aug 2022 6:00 PM IST
Will Samantha Ruth Prabhu and Naga Chaitanya Ever Work Together?
X

Tollywood: సమంతతో మళ్ళీ కలిసి నటించడంపై రియాక్ట్ అయిన నాగచైతన్య

Tollywood: నాగచైతన్య మరియు సమంత కలిసి నటించిన మొదటి సినిమా "ఏ మాయ చేసావే". ఆ సినిమాలో వారిద్దరి కెమిస్ట్రీ వళ్ళనే సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వీరిద్దరూ కలిసి జంటగా ఆటోనగర్ సూర్య, మనం వంటి సినిమాలలో కూడా నటించారు ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.

ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య సమంత కలిసి "మజిలీ" అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇలా వీరిద్దరూ కలిసి నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. కానీ విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉందా అనేది మాత్రం ఫాన్స్ లో సస్పెన్స్ గా మారింది. ఒకవేళ తామిద్దరూ ఒక రూమ్ లో ఉండాల్సి ఆ గదిలో ఉన్న పదునైన వస్తువులను దాచేయాలి అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది సమంత. మరోవైపు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య కూడా ఇలాంటి జవాబే ఇచ్చారు.

ఎప్పటికైనా సమంత మరియు నాగచైతన్య కలిసి నటించే అవకాశం ఉందా అని అడగగా నాగచైతన్య గట్టిగా నవ్వేశారు. "ఒకవేళ అదే జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో. కానీ అది జరుగుతుందో లేదో అనేది నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి," అని చెప్పుకొచ్చారు నాగచైతన్య. అంతేకాకుండా వ్యక్తిగత జీవితాన్ని వల్ల తాను వార్తల్లోకి ఎక్కటం తనకి ఇష్టం లేదని తమ విడాకుల గురించి ఏదైతే అభిమానులకు తెలియాలి అని అనుకున్నారో అది తాను ఇప్పటికే తెలియజేసేసానని స్పష్టం చేశారు చై.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story