Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది సినిమాలెక్కడ?

* ఎన్టీఆర్ బామ్మర్ది సినిమాలు ఉన్నాయా లేవా?

Dhatripriya
Published on: 13 Feb 2023 12:30 PM IST
Will NTR Brother-In-Law Narne Nithin Enter As A Hero Or Not
X

Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్ది సినిమాలెక్కడ?

Narne Nithin: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో నటుడిగా కెరియర్ మొదలు పెట్టారు తారక్ బామ్మర్ది నార్నే నితిన్. ఎన్టీఆర్ భార్య ప్రణతి కి నితిన్ స్వయాన తమ్ముడు అవుతాడు. త్వరలోనే నార్నే నితిన్ ఇండస్ట్రీ లో హీరోగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమం తో మొదలు పెట్టారు. ఈ వేడుక కు తారక్ వచ్చి స్వయంగా క్లాప్ కొట్టాడు. నితిన్ హీరోగా ఇప్పుడు ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను అధికారికంగా ఎనౌన్స్ చేశారు.

సతీష్ వేగేశ్న దర్శకత్వంలో "శ్రీ శ్రీ రాజావారు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న నితిన్ తేజ దర్శకత్వంలో "చిత్రం 1.1" అనే మూవీ లో కూడా నటిస్తున్నారు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తున్న సినిమా పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక తేజ మరోవైపు దగ్గుబాటి అభిరామ్ హీరోగా "అహింస" అనే సినిమాని కూడా తెరకెక్కించారు. ఈ సినిమా పూర్తయ్యాక "చిత్రం 1.1" సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలకి సంబంధించి అప్డేట్ వచ్చి ఏడాది దాటింది కానీ ఇంకా సినిమాకి సంబంధించి ఊసు లేదు.

మరోవైపు "శ్రీ శ్రీ రాజావారు" అనే సినిమా పోస్టర్ కూడా లాంచ్ చేసి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాల గురించి సతీష్ వేగేశ్న ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తారక్ బామ్మర్ది గా నార్నే నితిన్ ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు కానీ తేజ సినిమా మొదలు అయ్యేంత వరకు కూడా నితిన్ డెబ్యూ గురించి క్లారిటీ రాదేమో.

Dhatripriya

Dhatripriya

Next Story