"కస్టడీ" సినిమాతో నాగచైతన్య మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడా?

Naga Chaitanya: మాస్ ఇమేజ్ కోసం ఈ డైరెక్టర్ ని నమ్ముకున్న నాగచైతన్య

Jyothi
Updated on: 21 March 2023 9:30 PM IST
Will Naga Chaitanya get a Mass Image with the Movie Custody?
X

"కస్టడీ" సినిమాతో నాగచైతన్య మాస్ ఇమేజ్ తెచ్చుకుంటాడా? 

Naga Chaitanya: ఈ మధ్యకాలంలో అందరూ హీరోలు మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. యువ హీరో అక్కినేని నాగచైతన్య కూడా కెరీర్ మొదట్లోనే ఈ జాబితాలో చేరిపోయాడు. నిన్న మొన్నటిదాకా లవర్ బాయ్ తరహా పాత్రలు పోషించిన నాగచైతన్య ఇప్పుడు మాస్ ఇమేజ్ కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజానికి నాగచైతన్య కరియర్ మొదట్లో కూడా "జోష్" వంటి సినిమాలు తో మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించారు. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు.

"ఏ మాయ చేసావే" బ్లాక్ బస్టర్ అవడంతో అలాంటి తరహా సినిమాలు చేశారు. దడ, తడాఖా, బెజవాడ, ఆటోనగర్ సూర్య, యుద్ధం శరణం, వంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ అందులో ఒకటి కూడా హిట్ అవ్వలేదు. కానీ నాగచైతన్య నటించిన ప్రేమ కథలు 100% లవ్, మనం, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ మాత్రం మంచి హిట్ అయి నాగచైతన్య కి కూడా మంచి ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. తాజాగా ఇప్పుడు నాగచైతన్య మరొకసారి మాస్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. ఆ సినిమానే "కస్టడి".

తమిళ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్ తెలుగు బై లింగువల్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై నాగచైతన్య తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. వెంకట్ ప్రభు తమిళ్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలోనే "కస్టడీ" సినిమా కూడా మంచి హిట్ అయి తనకి మాస్ ఇమేజ్ ని తెచ్చిపెడుతుందని నాగచైతన్యతో పాటు తన అభిమానులు కూడా ఆశపడుతున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎంతవరకు హిట్ అందుకుంటాడో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story