రుద్రమదేవి విషయంలో చేసిన తప్పు గుణశేఖర్ "శాకుంతలం" లో కూడా చేస్తారా?

Gunasekhar: గుణశేఖర్ కనీసం ఈ సినిమాతో అయినా మెప్పిస్తారా?

admin1
Updated on: 23 Feb 2022 3:30 PM IST
Will Gunasekhar at Least Impress With This  Shaakuntalam Movie | Telugu Movie News
X

Gunasekhar: గుణశేఖర్ కనీసం ఈ సినిమాతో అయినా మెప్పిస్తారా?

Gunasekhar: సొగసు చూడ తరమా, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్న స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ 2015లో అనుష్క హీరోయిన్గా "రుద్రమదేవి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బయోగ్రఫీకల్ పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం బాగోక పోవడం సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ గా మారింది. గుణశేఖర్ దర్శకత్వం బాగానే ఉన్నప్పటికీ వీ ఎఫ్ ఎక్స్ ల వల్ల సినిమా డిజాస్టర్ గా మారింది.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ సమంత హీరోయిన్ గా "శాకుంతలం" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు గుణశేఖర్. ఈ సినిమా కూడా పీరియడ్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ సినిమాలో కూడా రుద్రమదేవికి మించి విజువల్ ఎఫెక్ట్స్ వాడాల్సి ఉంది. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. రుద్రమదేవితో బోలెడంత నెగిటివిటీ ని చూసిన గుణశేఖర్ ఈ సినిమాకైనా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు

admin1

admin1

Next Story