దిల్ రాజు అనుకున్న సమయానికి "వారసుడు" విడుదలవుతుందా?

Dil Raju: "వారసుడు" విడుదల విషయంలో దిల్ రాజు ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

Jyothi
Published on: 9 Jan 2023 7:15 AM IST
Will Dil Raju Release Varasudu on time?
X

దిల్ రాజు అనుకున్న సమయానికి "వారసుడు" విడుదలవుతుందా?

Dil Raju: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాగా వారసుడు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా కోసం సినిమా నిర్మాత దిల్ రాజు బోలెడు థియేటర్లు తీసుకున్నారు అని మిగతా సినిమాలకు లేకుండా చేశారు అని వివాదం వల్ల సినిమా పై బజ్ బాగానే పెరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యనే విడుదలైన చిత్ర థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. మరోవైపు సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న తమన్ ఇంకా పెండింగ్ వర్క్ పూర్తి చేయకపోవడంతో సినిమా విడుదల తేదీ గురించి కన్ఫ్యూజన్ కూడా ఏర్పడింది.

ఈ సోమవారానికి సినిమాకి సంబంధించిన పనులు పూర్తి చేయాలని తెలుగు మరియు తమిళ్ వర్షన్స్ రెండిటిని డిస్ట్రిబ్యూటర్లకు అప్పచెప్పాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఏదేమైనా విడుదల తేదీ విషయంలో వస్తున్న కన్ఫ్యూజన్ వల్ల విజయ్ కూడా నిరాశ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్యనే సినిమా సెన్సార్ కి వెళ్లి యు సర్టిఫికెట్ తో బయటకు వచ్చింది. జనవరి 11న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కి సిద్ధమవుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, శరత్ కుమార్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఒక ఉమ్మడి కుటుంబం, హీరో సీఈవో, ఇంట్లో నుంచి గొడవల వల్ల విడిపోయిన అన్నదమ్ములను మళ్ళీ కలపడం, అవే ఫ్యామిలీ సెంటిమెంట్ ఈ సినిమాలో కూడా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరి ట్రైలర్ తో పెద్దగా మెప్పించలేకపోయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు కలెక్షన్లను నమోదు చేసుకుంటుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story