Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా..కానీ!

Will Always Have Great Respect on Samantha Says Naga Chaitanya
x

Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా..కానీ!

Highlights

Naga Chaitanya: నాగ చైతన్య, సమంతల విడాకుల వ్యవహరం బాలీవుడ్ లో ఇంకా హాట్‌ టాపిక్‌గానే ఉంది.

Naga Chaitanya: నాగ చైతన్య, సమంతల విడాకుల వ్యవహరం బాలీవుడ్ లో ఇంకా హాట్‌ టాపిక్‌గానే ఉంది. విడిపోయి నెలలు గడుస్తున్న వీరి రిలేషన్ , సపరేషన్ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. నేటి వరకు విడాకుల పై పెద్దగా నోరు విప్పని చైతన్య , లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌లో మాత్రం ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు.

విడాకుల గురించి కాకుండా, కొత్తగా సమంతపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్‌ ప్రశ్నించిన సందర్భంలో సమంత అంటే ఇప్పటికీ తనకు అమితమైన గౌరవం ఉందని, అది ఎప్పటికీ అలానే ఉంటుందన్నాడు చైతన్య. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే తాము విడాకులు ప్రకటన ఇచ్చామని ఆ సమయంలో కూడా తమకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉందని తెలిపాడు‌. కానీ అప్పుడప్పుడు అంతకుమించి ఏదో గొడవ మా మధ్య జరిగిందని చెప్పేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని‌ ఆ వార్తలు చూసి తాను చాలా విసుగు చెందినట్లు చైతన్య తెలిపాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories