Adipurush: "ఆది పురుష్" సినిమా మళ్లీ వాయిదా పడనుందా?

Adipurush: ప్రభాస్ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా?

Dhatripriya
Published on: 6 March 2023 1:11 PM IST
Will Adipurush Movie Get Postponed Again
X

Adipurush: "ఆది పురుష్" సినిమా మళ్లీ వాయిదా పడనుందా? 

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. కానీ సినిమా టీజర్ విడుదలైన తర్వాత ఆ ఆశలన్నీ బూడిద పాలయ్యాయి. టీజర్ లోని విజువల్ ఎఫెక్ట్స్ ఏ మాత్రం బాగోలేదని, కార్టూన్ లోనే ఇంకా మంచి గ్రాఫిక్స్ ఉంటాయని అభిమానులు సైతం చిత్ర బృందం పై దుమ్మెత్తి పోశారు.

దీంతో ఎప్పుడో సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ మీద రీ వర్క్ చేయడం కోసం చిత్ర బృందం సినిమా విడుదలని వాయిదా వేసింది. ఇక ఈ సినిమా జూన్ 16న థియేటర్లలో విడుదల అవుతుంది అని కొత్త విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మీద పని అయినప్పటికీ చిత్ర బృందం చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది అని తెలుస్తోంది.

ఓం రౌత్ మరియు చిత్ర బృందం మీద పెరిగిపోతున్న ప్రెషర్ కారణంగా సినిమా బడ్జెట్, ప్రొడక్షన్ టైం, మరియు విజువల్ ఎఫెక్ట్స్ లో మార్పులు అన్నీ పెరుగుతూ వస్తున్నాయట. దీంతో అసలు "ఆది పురుష్" సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు సైతం కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఒకవేళ సినిమాని నిజంగానే అనుకున్న తేదీకి విడుదల చేయాలన్నా కూడా అతి త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. సినిమాపై బజ్ రోజు రోజుకి తగ్గుతూ వస్తోంది. కాబట్టి సినిమాకి భారీ ప్రమోషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story