Wild Dog: 'వైల్డ్ డాగ్' ప్రీ-రిలీజ్ బిజినెస్ రిపోర్ట్

Wild Dog Pre-Release Business Report
x

నాగార్జున అక్కినేని (ఫొటో హన్స్ ఇండియా)

Highlights

Wild Dog: నాగార్జున అక్కినేని ప్రస్తుతం శుక్రవారం విడుదల కానున్న 'వైల్డ్ డాగ్' ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు.

Wild Dog: నాగార్జున అక్కినేని ప్రస్తుతం శుక్రవారం విడుదల కానున్న ఆయన తాజా చిత్రం వైల్డ్ డాగ్ ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. సయామి ఖేర్, అలీ రెజా, దియా మీర్జా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సోలమన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ సిినిమా ట్రైలర్ ఇప్పటికే భారీ హైప్‌ను క్రియోట్ చేసింది. ఈ చిత్రంలో నాగార్జున ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ. 9 కోట్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సేఫ్ జోన్ లో చేరాలంటే.. బ్రేక్ ఈవెన్ రూ. 9.5 కోట్లు సాధించాలి.

ప్రపంచవ్యా ప్తంగా వైల్డ్ డాగ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను ఓ సారి చూద్దాం..

నైజాం - రూ. 2.5 కోట్లు

సీడెడ్ - రూ. 1.2 కోట్లు

ఆంధ్రప్రదేశ్– రూ. 4 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బిజినెస్ - రూ. 8.7 కోట్లు

కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ. 80 లక్షలు

విదేశాలలో - రూ. 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 9 కోట్లు

బ్రేక్ఈవెన్ - రూ. 9.5 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories