Wild Dog Trending: ఓటీటీలో సత్తాచాటుతున్న 'వైల్డ్‌డాగ్‌'

Wild Dog Trending: కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. అహిషోర్‌ సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Samba Siva Rao
Published on: 24 April 2021 6:30 PM IST
Wild Dog Movie
X

Wild Dog Movie File Image

Wild Dog Trending: కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'వైల్డ్‌డాగ్‌'. అహిషోర్‌ సాల్మన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ విమర్శకుల నుంచి ప్రసంశలు పొందింది. అయితే కోరానా కారణంగా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఏజెంట్‌గా నాగార్జున తన బృందంతో చేసిన సహాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమాకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఈ నేపథ్యంలో యాక్షన్‌ బ్రేక్‌ డౌన్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా తాజాగా వీడియోను విడుదల చేసింది. సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను ఏవిధంగా తెరకెక్కించారన్న విషయాలను నాగార్జున, సయామీఖేర్‌లు పంచుకున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో ఉండగా, తమిళ వెర్షన్‌ టాప్‌-5లో ఉండటం గమనార్హం. మలయాళ, కన్నడ భాషల్లోనూ 'వైల్డ్‌డాగ్‌'కు మంచి ఆదరణ లభిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా విడుదల చేసిన ఈ వీడియోలో రోహ్‌తంగ్‌ పాస్‌లో షూటింగ్‌ సందర్భంగా చేతిలో గన్‌ పట్టుకుని ఉండగా చలికి వణికిపోతుంటే కెమెరామెన్‌ 'సర్‌ మీ చేతులు వణికిపోతున్నాయి. కదలకుండా ఉంచండి' అని చెప్పేవారట. కొండపై నుంచి కిందకు జారుకుంటూ వచ్చే సన్నివేశంలో తన కాలికి చిన్న చిన్న గాయాలు అయినట్లు నాగార్జున వెల్లడించారు. ఇక ఈ సినిమాలో దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story