Wife i: జనవరి 3 న 'వైఫ్ ఐ'

Wife i: జనవరి 3 న వైఫ్ ఐ
x
Highlights

తెలుగులో ఎంత టీజర్, ట్రైలర్స్ తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏడు చేపల కథ..

తెగులో ఎంత టీజర్, ట్రైలర్స్ తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏడు చేపల కథ.. ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను ధియేటర్ లోకి అయితే రప్పించగలిగింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. అయితే ఈ సినిమా ద్వారా బాగా పాపులరైన అభిషేక్‌రెడ్డి చేస్తున్న తాజా చిత్రం వైఫ్'ఐ. గుంజన్, ఫిదాగిల్ ఇతర పాత్రలు చేస్తున్నారు. జిఎస్‌ఎస్‌పీ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని జనవరి 3 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

సినిమా విడుదలకి దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ వర్క్ ని స్టార్ట్ చేసింది చిత్ర బృందం. అందులో భాగంగానే హెచ్ ఎం టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగానే సినిమాకి సంబందించిన కొన్ని విశేషాలను చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన గుంజన్ మాట్లాడుతూ తెలుగులో నాకిది మొదటి చిత్రమిది. భాష నేర్చుకుని డైలాగులు చెప్పా. నా పాత్ర అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా. వైఫ్ ఐకి అందరి సపోర్ట్ కోరుతున్నానని అన్నారు.

ఇక సినిమాలో హీరోగా సూర్య మాట్లాడుతూ .. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలని, అభిషేక్ మంచి నటుడు. సెట్స్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకి రాంబాబు గోషాల పాటలను అందించగా, వినోద్ సంగీతం అందించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories