తమన్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

పవన్ కళ్యాణ్ అభిమానులకు తమన్ సంగీతం ఎందుకు నచ్చటం లేదు?

Arun Chilukuri
Updated on: 31 Jan 2023 9:30 PM IST
Why Pawan Kalyan fans are not happy with Music Director Thaman?
X

తమన్ పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజీత్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "దే కాల్ హిం ఓజి" అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించబోతున్నారు అని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంలో కొంత నిరాశ చెందినట్లు అనిపిస్తోంది. తమన్ సంగీతాన్ని అందించడం పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చటం లేదు. ఈ నేపథ్యంలో తమన్ పై సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు నటించిన "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలకు తమన్ సంగీతాన్ని అందించారు. ఆ రెండు సినిమాలలోనూ తమన్ అందించిన సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి.

ముఖ్యంగా "భీమ్లా నాయక్" సినిమాకి తమన్ అందించిన "లా లా బీమ్లా.." టైటిల్ సాంగ్ వల్లే సినిమాపై ఇంకా అంచనాలు ఎక్కువ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలలో మంచి సంగీతాన్ని అందించినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు తమన్ పై ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారో మాత్రం అర్థం కావడం లేదు. ఇక ఈ మధ్యనే ఈ సినిమాని ఒక పూజా కార్యక్రమం ద్వారా అధికారికంగా లాంచ్ చేశారు. డివివి దానయ్య మరియు అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story