logo

'సాహో' మ్యూజిక్ పై ఇంకా లేని క్లారిటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడిందని బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి. అయితే తాజాగా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభాస్ సినిమా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అంతేకాకుండా ఈ పోస్టు ద్వారా ఈ సినిమా అనుకున్నట్లుగానే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కాబోతోంది అన్న విషయాన్ని స్పష్టం చేశారు దర్శక నిర్మాతలు.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న వారి గురించి గత కొంతకాలంగా చర్చ సాగుతూనే ఉంది. మొదట్లో శంకర్-ఎహ్సాన్-లోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలలో కూడా బాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడారు కానీ అది ఎవరు కంపోజ్ చేశారు అనే విషయం మాత్రం చెప్పలేదు. తాజాగా విడుదలైన పోస్టర్లలో కూడా సంగీత దర్శకుడి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఈ సినిమా సంగీతాన్ని అందించనున్నారు? ఒకవేళ శంకర్-ఎహసాన్-లాయ్ తప్పుకున్నారా? 'సాహో' చిత్ర దర్శక నిర్మాతలు సినిమా సంగీత బాధ్యత వేరే సంగీత దర్శకుడి చేతిలో పెట్టారా? అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

లైవ్ టీవి

Share it
Top