చైతన్యతో విడాకుల విషయంలో సమంత చేసిన తప్పేంటి.. అక్కినేని ఫ్యామిలీ ఎందుకు స్పందించడంలేదు?

Why is the Akkineni Family not Responding?
x

చైతన్యతో విడాకుల విషయంలో సమంత చేసిన తప్పేంటి.. అక్కినేని ఫ్యామిలీ ఎందుకు స్పందించడంలేదు?

Highlights

Samantha Ruth Prabhu: తెలుగు ప్రజలకు సినిమా ఓ ఎమోషన్..! సినిమా మాత్రమే కాదు తమ అభిమాన నటుల వ్యక్తిగత జీవితాలన్నా అంతే ఆసక్తి.!

Samantha Ruth Prabhu: తెలుగు ప్రజలకు సినిమా ఓ ఎమోషన్..! సినిమా మాత్రమే కాదు తమ అభిమాన నటుల వ్యక్తిగత జీవితాలన్నా అంతే ఆసక్తి.! తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఏం చేసినా అభిమానులకు స్పెషల్‌గానే ఉంటుంది.! అయితే, సెలబ్రిటీల పర్సనల్‌ లైఫ్‌పైనా ఫ్యాన్స్ ఫోకస్ చేస్తున్నారా.? వాళ్లు తీసుకొనే వ్యక్తిగత నిర్ణయాలు అభిమానులపై ప్రభావం చూపుతున్నాయా.? టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ నాగచైతన్య-సమంత డివోర్స్ ఎపిసోడ్‌లో అసలేంజరుగుతోంది.?

నాగచైతన్య-సమంత విడాకుల నిర్ణయంపై ఎవరికి తోచిన వాదన వారిది.. ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్లది.! అడిగేవారు లేరు అడగాల్సిన వారు అడగరు. నిజానికి ఎన్నో ఏళ్ల బంధానికి స్వస్తి పలకడానికి వాళ్లెంత నలిగిపోయి ఉంటారు.? అయితే, ఇవేం ఆలోచించకుండానే ఒక్కరినే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారా.? అంటే అవుననే చెబుతున్నారు సమంత.! విడాకులు ఎంతో కఠిన నిర్ణయమనీ తనపై వ్యక్తిగత దాడి దారుణమనీ వాపోయారు. నిజంగానే చైతన్య-సమంత డివోర్స్ ఎపిసోడ్‌లో శామ్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారా.?

"నాకు ఎఫైర్స్ ఉన్నాయంటున్నారు.. నేను పిల్లల్ని కనకూడదనుకున్నా అంటున్నారు.. అబార్షన్లనీ, అవకాశవాదిననీ ఏవేవో మాట్లాడారు.. ఇది నా వ్యక్తిగతంపైన జరిగిన దారుణమైన దాడి." ఇవీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సమంత చేసిన కామెంట్స్.! నిజానికి విడాకులు అనేవి భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీసుకొనే కఠిన నిర్ణయం. అలాంటి నిర్ణయం వెనుక ఏముందో వాళ్లకి మాత్రమే తెలుసు. కానీ చైతన్య-సమంతలు మాత్రం సెలబ్రిటీలు కావడంతోనే సోషల్ మీడియా వేదికగా రచ్చ రేగుతోంది.

అక్కినేని నాగ చైతన్య సమంత విడిపోతున్నట్లు ప్రకటించిన క్షణం నుంచీ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ముఖ్యంగా సమంతనే టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్లి కొందరు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. ఇలా కామెంట్స్ చేసే వారు ఎవరికీ సమంతతో కనీస పరిచయం కూడా ఉండదు.! సెలబ్రిటీ అయినంత మాత్రాన ఎవరిని పడితే వాళ్లని ఏదిపడితే అది అనేయొచ్చా వారికి వ్యక్తిగత జీవితం అనేది ఉండదా.? నెటిజన్లు ఈ ప్రశ్నలు ఎందుకు వేసుకోవట్లేదు.?

నిజానికి సమంత చైతన్యను కాదనుకొని వెళ్లిపోలేదు. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చే డివోర్స్ ప్రకటన చేశారు. కానీ సమంతానే అందరూ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? ఆమె చేసిన సినిమాలను సినిమాగా మాత్రమే ఎందుకు చూడలేకపోతున్నారు.? ఒక వ్యక్తితో ఫొటోలు దిగితే ఎఫైర్స్ ఉన్నట్లేనా.? లేదంటే ఓ పెద్ద ఫ్యామిలీకి కోడలిగా వెళితే వ్యక్తిగత జీవితాన్ని మార్చేసుకోవాలా? నిజానికి సమంత చేసిన తప్పేంటి? చాలా మందిని వేధిస్తున్న ప్రశ్నలే ఇవి.

చై-శామ్ డివోర్స్ ప్రకటన అనంతరం సమంతనే టార్గెట్ చేస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.! సమంతపై జరుగుతున్న వ్యక్తిగత దాడిపై అక్కినేని ఫ్యామిలీ ఎందుకు స్పందించలేదు.? దాదాపు పదేళ్ల స్నేహం, నాలుగేళ్ల వివాహ బంధం ఒక్క ప్రకటనతో ఎలా తెగిపోయింది.? అన్నది శామ్ అభిమానుల ప్రశ్న. ఇప్పటికైనా సమంతను టార్గెట్ చేయడంపై అక్కినేని ఫ్యామిలీ స్పందించాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి.

దాదాపు పదేళ్ల స్నేహం.. నాలుగేళ్ల వివాహ బంధం.! విడిపోతారనే కాదు.. కనీసం గొడవ పడతారని కూడా ఏ ఒక్కరూ ఊహించి ఉండరేమో.! అలాంటిది ఏకంగా "లెట్స్ మూవ్ ఆన్" అనేశారు.! వాళ్ల జీవితంలో ఏం జరిగిందో పక్కన పెడితే చై-శామ్ డివోర్స్ నిర్ణయాన్ని జనం ఎలా తీసుకుంటున్నారు.? అక్కినేని యంగ్ హీరోపై ఉన్న సాఫ్ట్ కార్నర్ సమంతాపై ఎందుకు లేదు.? ఇన్నేళ్లుగా గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానులు సైతం ఎందుకు శామ్‌ను వ్యతిరేకిస్తున్నారు.?

సూపర్ డీలక్స్.. ఫ్యామిలీమెన్-2.. చైతన్య-సమంత డివోర్స్ ప్రకటన తర్వాత నెటిజన్ల సర్కిల్‌లో విపరీతంగా తిరిగిన అంశం ఇదే.! ఇవే కాదు సమంత పర్సనల్ స్టైలిస్ట్ గౌతమ్ జుకల్కర్‌తో ఆమె దిగిన ఫొటోలు సహా ఎన్నో అంశాలను తవ్వి మరీ తీస్తున్నారు. నిజానికి వీటిల్లో సమంత చేసిన తప్పేంటి.? ఓ మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె ఇంటిమేటెడ్ సీన్లలో నటించకూడదా.? ఎవరితోనో ఫొటో దిగితే అఫైరేనా.? ఇవే అంశాలు ఓ మగాడి విషయంలో ఎదరైతే ఇలాగే ప్రశ్నిస్తారా..? సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఇవే ప్రశలు సంధించారు.

డివోర్స్ అంశంలో తీవ్ర మనోవేధన అనుభవిస్తున్న శామ్‌ను ఇప్పుడు నెట్టింట్లో ఎదురయ్యే కామెంట్లే ఎక్కువగా వేధిస్తున్నాయి. వీటినుద్దేశించే శామ్ సమాజం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై నేటికీ సమాజం చూపుతున్న తీరుపై మండిపడ్డారు. 'మహిళలు ఏం చేసినా ప్రశ్నించే ఈ సమాజం.. పురుషులు ఏం చేసినా ఎందుకని ప్రశ్నించదు. ప్రాథమికంగా పాటించాల్సిన నైతిక విలువలు కూడా లేని ఈ సమాజాన్ని మనమే నిర్మించుకున్నాం' అంటూ ప్రముఖ రచయిత్రి ఫరిదా ఇచ్చిన సందేశాన్ని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్‌ చేశారు.

నిజానికి సమంత అడిగిన దాంట్లో తప్పేముంది.? మహిళలపై సమాజం తీరులో మార్పెక్కడుంది.? మహిళ విషయంలో వచ్చినంతగా మగాళ్లపై ఎవరూ ఓ నిర్ణయానికి రారెందుకు.? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే లపువురు స్త్రీ వాదులు సంధిస్తున్నారు. ఇదే సమయంలో.సమంత వ్యక్తిగత జీవితంపైనా పలువురు లేవనెత్తిన అంశాలపై మండిపడుతున్నారు. సమంత పిల్లల్ని కనకూడదనుకున్నారని, ఆమెకు అబార్షన్లు అయ్యాయని వచ్చిన వార్తలపైనా సీరియస్ అయ్యారు. విడిపోయి బాధలో ఉన్న సమంతకు మద్దతుగా నిలవడం మానేసి మరింత కృంగదీయడం ఎంతవరకూ కరెక్టని ప్రశ్నిస్తున్నారు.

సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ డివోర్స్ నిర్ణయం తీసుకోవడం కష్టమైనదే.! ఈ విషయాన్ని నెటిజన్లు, అభిమానులు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారో అన్న వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నాగచైతన్య-సమంతల పర్సనల్ స్పేస్‌ను వారికి వదిలేస్తే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories