పెళ్లెందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు లతా మంగేష్కర్ ఏం జవాబిచ్చారో తెలుసా..

Lata Mangeshkar Marriage: లతా మంగేష్కర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి.

Arun Chilukuri
Published on: 6 Feb 2022 4:17 PM IST
Why Lata Mangeshkar Never got Married?
X

పెళ్లెందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు లతా మంగేష్కర్ ఏం జవాబిచ్చారో తెలుసా..

Lata Mangeshkar Marriage: లతా మంగేష్కర్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అని చెప్పుకోవాలి. చిన్న వయసులోనే స్టార్ సింగర్ గా ఫేమ్ తెచ్చుకున్న లతాజీ వివాహం ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న ఆమె అభిమానుల మనస్సులో అలానే నిలిచిపోయింది . అయితే గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో లతాజీ ఈ ప్రశ్నకు స్పందించారు.

ఎప్పుడూ పెళ్లి గురించి మాట్లాడని లతా మంగేష్కర్ ఆ ఇంటర్వ్యూలో మాత్రం మాట్లాడింది. ప్రేమ తన జీవితంలో ఎలాంటి పాత్ర పోషించింది.. తన జీవితంలో ఆ అదృష్టవంతుడు ఎవరు అని అడిగినప్పుడు లతా ఇలా సమాధానమిచ్చారు. హృదయానికి మాత్రమే తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.. నేను దానిని అలాగే ఉంచాలనుకుంటున్నాను అంటూ సమాధానమిచ్చారు లతా మంగేష్కర్.

జీవితంలో ప్రతిదీ దేవుడు నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా ఆన్సర్ మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు.

దేశంలో చాలా మంది చెప్పినట్లు.. పెళ్లి, సంసారం, పిల్లలు ఉంటేనే ఆడవాళ్లు సంపూర్తి అయితే.. అది తాను పట్టించుకోను అని చెప్పుకొచ్చారు లతా. ప్రజలు అన్ని రకాల విషయాలు మాట్లాడతారు.. కాబట్టి వాటిని విస్మరించడం నేర్చుకోండి.. లేకుంటే, సంతోషకరమైన జీవితాన్ని గడపడం కష్టమవుతుంది.. ప్రతికూలమైన, నిరుత్సాహపరిచే శక్తులను అరికట్టాల్సిందే.. తాను ఎప్పుడూ అదే చేస్తానంటూ చెప్పింది లతా జీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story