ఇంతకీ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా..?

ఇంతకీ సంక్రాంతి విన్నర్ ఎవరో తెలుసా..?
x
Highlights

Super Star Krishna: తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్. ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాలు పోటీ పడుతుంటాయి.

Super Star Krishna: తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్. ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సెంటిమెంట్ మొదలయింది దివంగత సూపర్ స్టార్ కృష్ణ నుంచి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 సంక్రాంతి సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతికి 30 సినిమాలు చేసిన హీరో ఎవరూ లేరు. అది కేవలం కృష్ణకే దక్కింది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. సంక్రాంతికి ఒక సినిమా కలిసి వచ్చిందంటే చాలు.. అదే సెంటిమెంట్‌తో వరుస హిట్లు కొట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో టాప్‌లో నిలిచారు కృష్ణ. సంక్రాంతి సెంటిమెంట్‌తో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించారు. దీంతో సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. కృష్ణకి సంక్రాంతి సెంటిమెంటు మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆ నాటి నుంచి సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని నియమం పెట్టుకున్నారంట కృష్ణ. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి కృష్ణ సినిమాలు వచ్చేవి. అలా 30 సినిమాలు చేశారు.

కృష్ణ దాదాపు 350కి పైగా సినిమాలు చేశారు. అందులో 30 సినిమాలు సంక్రాంతి సినిమాలే కావడం విశేషం. 1968లో సంక్రాంతికి అసాధ్యుడు సినిమా విడుదలైంది. ఆ తర్వాత 1969లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు, 1973లో మంచి వాళ్లకు మంచివాడు, 1976లో పాడి పంటలు, 1977లో కురుక్షేత్రం, 1978లో ఇంద్రధనస్సు, 1980లో భలే కృష్ణుడు, 1981లో ఊరికి మొనగాడు, 1983లో బెజవాడ బెబ్బులి, 1984లో ఇద్దరు దొంగలు, 1985లో అగ్ని పర్వతం సినిమాలు విజయం సాధించాయి. ఇంతటితోనే ఆయన విజయం ఆగలేదు. ఆ తర్వాత కూడా దీన్ని ఆయన కొనసాగించారు.

1987లో తండ్రీ కొడుకుల ఛాలెంజ్, 1988లో కలియుగ కర్ణుడు, 1989లో రాజకీయ చదరంగం, 1990లో ఇన్‌స్పెక్టర్ రుద్ర, 1992లో పరమ శివుడు, 1993లో పచ్చని సంసారం, 1994లో నంబర్ వన్, 1995లో అమ్మ దొంగా ఇలా సంక్రాంతుల సరదా సాగింది.

అలా స్టార్ట్ అయిన సంక్రాంతి సినిమాల రికార్డు బ్రేకింగ్ 30కి చేరింది. ఎన్టీఆర్ నటించిన సినిమాలు 28 సంక్రాంతికి విడుదలయ్యాయి. కృష్ణ నటించిన సినిమాలు 30 విడుదలయ్యాయి.

సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీసు దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలామంది ఉన్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. హీరోగా రిటైరైన తర్వాత కూడా సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో సంక్రాంతి బరిలో దిగి హిట్ సాధించారు ఏఎన్నార్.

ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు కూడా సంక్రాంతికి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరు నటించిన పలు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి హిట్ టాక్ తెచ్చుకున్నారు. కానీ కృష్ణను మాత్రం ఎవరూ క్రాస్ చేయలేక పోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి హీరో సూపర్ స్టార్ కృష్ణనే.

Show Full Article
Print Article
Next Story
More Stories