Balakrishna: సంక్రాంతి సీజన్ ను వదిలేదే లేదు అంటున్న బాలకృష్ణ

Balakrishna: రిలీజ్ విషయంలో మంకు పట్టు పట్టి కూర్చున్న బాలకృష్ణ

Jyothi
Published on: 23 Oct 2022 11:16 AM IST
Balakrishna Says that His Film Should be Released on Sankranthi
X

Balakrishna: సంక్రాంతి సీజన్ ను వదిలేదే లేదు అంటున్న బాలకృష్ణ

Balakrishna: ఈ మధ్యనే "అఖండ" సినిమాతో భారీ విజయాన్ని సాధించిన నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "క్రాక్" సినిమాతో మాస్ మహారాజా రవితేజ కి అదిరిపోయే హిట్ అందించిన గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి "వీర సింహారెడ్డి" అనే టైటిల్ ను అనుకుంటున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ బాలకృష్ణ మాత్రం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని మంకు పట్టు పట్టి కూర్చున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. ఆ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే దిగనుంది. అందుకే బాలకృష్ణ సినిమాని డిసెంబర్లోనే విడుదల చేస్తే బాగుంటుందని మైత్రి వారు అభిప్రాయపడ్డారు. కానీ బాలకృష్ణ మాత్రం సంక్రాంతి నుంచి తన సినిమాని కలిపేది లేదు అని తన మాట నెగ్గించుకుని మరి సంక్రాంతికే తన సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్", విజయ్ "వారసుడు" వంటి సినిమాలు సంక్రాంతికి విడుదల కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి.

Jyothi

Jyothi

Next Story