చిరంజీవి నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరు?

*రవితేజ డైరెక్టర్ తో చేతులు కలపనున్న మెగాస్టార్ చిరంజీవి

Jyothi
Updated on: 30 Jan 2023 10:00 AM IST
Who is the Director of Chiranjeevi Next Movie?
X

చిరంజీవి నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ ఎవరు? 

Chiranjeevi: "ప్రియతమా నీవచట కుశలమా" సినిమాతో డైరెక్టర్ గా మారిన త్రినాధ రావు నక్కిన "సినిమా చూపిస్త మామ", "నేను లోకల్" వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ లో తన ఖాతా లో వేసుకున్నారు. వరుస డిజాస్టర్ లతో సతమతమైన రవితేజకు "ధమాకా" సినిమా తో త్రినాథ్ రావు నక్కిన మర్చిపోలేని విజయాన్ని అందించారు.

ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ చిరంజీవి హీరోగా నటించిన "వాల్తేరు వీరయ్య" సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు చిరంజీవి మరియు త్రినాథ్ రావు నక్కిన కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం త్రినాధరావు నక్కిన చిరంజీవికి ఒక మంచి కథను వినిపించారట. చిరు కి కూడా ఈ సినిమా బాగా నచ్చటంతో వెంటనే ఓకే చెప్పేసారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. త్రినాథ్ రావు నక్కిన చిరంజీవితో ఎలాంటి సినిమా తీయబోతున్నారు అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళాశంకర్" అనే సినిమాతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా చిరంజీవి కొన్ని నిర్మాణ సంస్థలతో చేతులు కలిపారు కానీ ఇంకా ఆ సినిమా లకు డైరెక్టర్లు ఖరారు కావాల్సి ఉంది.

Jyothi

Jyothi

Next Story