Ramya Krishnan: వీళ్లతో పనిచేస్తే..పార్టీ మూడ్ లో ఉన్నట్లే: రమ్యకృష్ణ

When Work Feels Like Party Mode in the Right Company Says Ramya Krishnan
x

రమ్య  కృష్ణ, విజయ్ దేవరకొండ (ఫోటో ఇన్‌‌స్టాగ్రామ్)

  

Highlights

Ramya Krishnan: మంచి కంపెనీ దొరకాలే గానీ చేసే పని కూడా పార్టీ ఫీల్ తో ఉంటుందంటున్నారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ.

Ramya Krishnan: మంచి కంపెనీ దొరకాలే గానీ పని కూడా పార్టీ లానే అనిపిస్తుందంటూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. 'లైగర్' షూట్ లో విజయ్ దేవరకొండతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు. విజయ్‌ అండ్ టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉందంటూ ఆమె ఈ కామెంట్ చేశారు. దీంతో విజయ్, రమ్యకృష్ణ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లైగర్'. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ సహా పలు సౌత్ ఇండియన్ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

అయితే, ముంబై బ్యాక్‌డ్రాప్‌ గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న లైగర్ ను రియాలిటీకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు డైరెక్టర్ పూరి. ఈ మేరకు విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో కూడా‌ శిక్షణ తీసుకున్నారు. ఇటీవలే ముంబైలో మరో షెడ్యూల్ కంప్లీట్ చేశారు. లైగర్ చిత్రాన్ని సెప్టెంబర్‌ 9న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూరీ జగన్నాద్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోన్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories