చిరు, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు?

చిరు, త్రివిక్రమ్ సినిమా మొదలయ్యేది ఎప్పుడు?
x
Highlights

మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలనీ అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలనీ అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు. అయన రాజకీయాల్లోకి వెళ్ళడంతో ఆయనతో సినిమా చేసే ఛాన్స్ లేనట్లే అని యువ దర్శకులు అనుకునే క్రమంలో అయన మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. చిరు రీఎంట్రీ సినిమాగా వివి వినాయక్ దర్శకత్వంలో ఖైది నెంబర్ 150 తెరకెక్కింది. ఆ తర్వాత యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహ రెడ్డి చిత్రంలో నటించాడు చిరు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్సకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శేరావేగంగా జరుపుకుంటుంది.

ఈ సినిమా తర్వాత చిరంజీవి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాని చేయనున్నాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవినే స్వయంగా ప్రకటించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేయనున్నాడు. ఈ సినిమాకి అయిననూ పోయి రావలే హస్తినకు.. అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. జూన్ నుంచి సినిమా మొదలు కానుంది.

ఇక కొరటాల శివతో చిరు, ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాలు చేశాక ప్రీ అవుతారు. అప్పుడు వీరిద్దరి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాదికి సినిమాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో విజయభాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించాడు. ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, బన్నీతో చెరో మూడు సినిమాలు చేశాడు. కానీ చరణ్, చిరంజీవితో మాత్రం ఒక్కసారి కూడా పని చేయలేదు. ఇప్పుడు ఆ కల ఈ సినిమాతో తీరనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories