Pushpa 2: పుష్ప2లో రణ్ వీర్ సింగ్..పాత్ర ఏంటంటే?

What is the Role of Ranveer Singh in Pushpa 2?
x

Pushpa 2: పుష్ప2లో రణ్ వీర్ సింగ్..పాత్ర ఏంటంటే?

Highlights

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ పుష్ప2 మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో చెక్కుతున్నారు.

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ పుష్ప2 మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో చెక్కుతున్నారు. ఈ మూవీలో పలు ఇండస్ట్రీల స్టార్లను భాగం చేస్తున్న సుక్కు..తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను భాగం చేశాడు..రణ్ వీర్ పాత్ర ఎలా ఉంటుందంటే..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఏ రేంజ్ లో హిట్టయిందో మనందరికీ తెలిసిందే..తెలుగులో కంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో పుష్ప మూవీ దుమ్ము దులిపేసింది. పుష్ప పాటలకు క్రికెటర్లు సైతం కాలు కదిపారు. ఆ వీడియోలు నెట్టింట ఎంత వైరల్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీకి సుకుమార్ సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా పుష్ప ఎక్కడ అంటూ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసి సుకుమార్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు. పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భన్వర్ సింగ్ షెకావత్ గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ కు సంబంధించిన కీలక షెడ్యూల్ ని సుక్కు ఇప్పటికే పూర్తి చేశారు. పార్టీ లేదా పుష్ప అంటూ మొదటి భాగంలో ఆకట్టుకున్న ఫహాద్...పాత్ర రెండవ భాగంలో అంతకుమించి అనే రేంజ్ లో ఉంటుందని టాక్..

పుష్ప చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సుకుమార్ పుష్ప2 ని వరల్డ్ క్లాస్ క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారు. బన్నీ లుక్ తో పాటు..సినిమాలో తమిళ, కన్నడ, హిందీ భాషలకు చెందని స్టార్లను సైతం పుష్ప2లో భాగం చేస్తూ సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను పుష్ప2లో భాగం చేశారు. ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రణ్ వీర్ కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.

RRR మూవీతో తెలుగు సినిమా క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. తెలుగు సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ అగ్ర నటులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రంలో సైఫ్ విలన్ గా నటిస్తుండగా..మహేష్ మూవీలో అక్షయ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక, తాజాగా పుష్ప2లో రణ్ వీర్ సింగ్ చేరాడు..మొత్తంగా, పుష్ప2 తో మన టాలీవుడ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగడం ఖాయంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories