War 2 OTT Release: ఓటీటీలోకి 'వార్ 2'.. అధికారిక ప్రకటన

War 2 OTT Release: భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఎన్టీఆర్‌ (NTR) మరియు హృతిక్‌ రోషన్‌లు కలిసి నటించిన ‘వార్ 2’ (War 2 Movie) ఒకటి.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 5:17 PM IST
War 2 OTT Release: ఓటీటీలోకి వార్ 2.. అధికారిక ప్రకటన
X

War 2 OTT Release: భారతీయ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఎన్టీఆర్‌ (NTR) మరియు హృతిక్‌ రోషన్‌లు కలిసి నటించిన ‘వార్ 2’ (War 2 Movie) ఒకటి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) యొక్క స్పై యూనివర్స్‌లో భాగమైన ఈ యాక్షన్ ఫ్రాంఛైజీలో కియారా అడ్వాణీ కథానాయికగా నటించింది.

గత ఆగస్టులో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ, ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని ప్రకటించి ప్రేక్షకులకు శుభవార్త చెప్పింది.

‘వార్ 2’ అక్టోబరు 9వ తేదీ (War 2 OTT Release Date) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్‌ థ్రిల్లర్, బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 300 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ స్పై థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story